ధర్మవరం మున్సిపల్ కార్యాలయానికి శుక్రవారం దివ్యాంగులు భారీగా చేరుకున్నారు. అనర్హులను గుర్తించే క్రమంలో అర్హులైన తమకు కూడా నోటీసులు ఇస్తున్నట్లు వారు గోడువెల్లబోసుకున్నారు. అధికారులతో విచారణ జరిపి అనర్హులను తొలగించి అర్హులైన తమకు పెన్షన్ పునరుద్ధరించాలని లేకపోతే ఆత్మహత్యలే శరణ్యమని దివ్యాంగులు మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ ముందు తమ ఆవేదన వ్యక్తపరిచారు.