కామారెడ్డి జిల్లా ఆర్టీసీ డిపో మేనేజర్ కరుణశ్రీ, అసిస్టెంట్ మేనేజర్ లింగమూర్తిలు ఉద్యోగ విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన సీతారాములు, సుజాత, రాజమణి, వెంకట్ తదితర ఉద్యోగులను శాలువాతో సన్మానించి, పెన్ను బహుకరించారు. అత్యధిక ఆదాయం, డీజిల్ ఆదాలో మెకానిక్ల పనితీరును ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఏడీసీలు తిరుపతి నాయక్, ఎస్ కే మూర్తి, హెడ్ కానిస్టేబుల్ గంగారెడ్డి పాల్గొన్నారు.