మోసపోతే గోస పడతామని కెసిఆర్ ఆనాడే చెప్పారని , యూరియా కొరత తీర్చాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కురవి మండల కేంద్రంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతుంటే, కాంగ్రెస్ సర్కార్ చోద్యం చేస్తుందని మండిపడ్డారు. యూరియా కోసం చెప్పులు ,పాస్బుక్కులు క్యూ లైన్లలో పెట్టి మహిళా రైతులు ఎండలో నిలబడే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో దాపురించాయని ఆరోపించారు.