పిల్లలను కిడ్నాప్ చేసే గ్యాంగ్ను పట్టుకొని స్థానికులు దేహశుద్ధి చేసిన ఘటన కొండాపూర్లో జరిగింది. కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో వాచ్మెన్ పిల్లలను టార్గెట్గా చేసి ఎత్తుకెళ్తున్నవారిని పట్టుకొని స్థానికులు దేహశుద్ధి చేశారు. ముఠా సభ్యులు ముగ్గురిలో ఇద్దరు ఆటోలో తప్పించుకోగా గ్యాంగ్లోని మహిళను కట్టేసి దేహశుద్ధి చేసి గచ్చిబౌలి పోలీసులకు అప్పజెప్పారు.