ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను నిర్దేశిత లక్ష్యం మేరకు.. పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో.. ఎంఐ ట్యాంకులు & గ్రౌండ్ వాటర్, సానుకూల ప్రజా దృక్పథం, ఏజెంట్ స్పేస్ కోసం డాక్యుమెంట్ అప్‌లోడ్, యూరియా లభ్యత & ధర నిర్ణయం, పిఎం కుసుమ్, CBG మొక్కలు, సౌర/పవన ప్రాజెక్టులుకు సంబంధించిన భూ సమస్యలు, స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు తదితర అంశాలపై.. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా నిర్వహించారు.