రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలోని తంగళ్లపల్లిలోని రైతు వేదిక వద్ద రైతులు యూరియా బస్తాల కోసం శుక్రవారం భారీ క్యూ లైన్ కట్టారు.ఉదయం నుంచి యూరియా కోసం లైన్లో నిలబడ్డామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.ఎన్ని ఎకరాలు ఉన్నా ఒకే యూరియా బస్తా మాత్రమే ఇస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం,అధికారులు స్పందించి సరిపడా యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకొని రైతులను ఆదుకోవాలని కోరారు.