కనిగిరి పట్టణంలోని శివనగర్ కాలనీలో ఉన్న బీసీ బాలికల హాస్టల్ ను కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ ఆదివారం పరిశీలించారు. హాస్టల్ ఆవరణలో నాలుగు గదులు శిధిలావస్థకు చేరడంతో పాటు, హాస్టల్లో ఉన్న గదులు కూడా స్లాబు పెచ్చులూడి పడుతూ దెబ్బ తినడాన్ని మున్సిపల్ చైర్మన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బీసీ బాలికల హాస్టల్ శిథిలావస్థకు చేరిన విషయాన్ని మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి దృష్టికి లిఖితపూర్వకంగా తీసుకువెళ్లి, హాస్టల్లో పూర్తిస్థాయి మరమ్మత్తులు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.