ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్న సంక్షేమ పథకాలకు బ్యాంకు రుణాల పంపిణీ వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మాధురి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో జిల్లాలోని అన్ని బ్యాంకు కంట్రోల్, ప్రభుత్వ అధికారులతో ఎల్డీఎం నర్సింగరావు కన్వీనర్ గా వ్యవహరించి 2025 మూడవ త్రైవసికానికి సంబంధించిన డీసీసీ డిఎల్ఆర్సి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మహిళా శక్తి రుణాలకు బ్యాంకులు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్బిఐ ఏజీఎం చేతన్, నవాడ్ ఏజీఎం కృష్ణ తేజ, డిసిసిబి బ్యాంక్ సీఈఓ శ్రీనివాస్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.