Download Now Banner

This browser does not support the video element.

సంతనూతలపాడు: ఉప్పుగుండూరులో గుడ్ టచ్, బ్యాడ్ టచ్, మాదకద్రవ్యాల అనర్ధాలపై అవగాహన కల్పించిన సీఐ శ్రీకాంత్ బాబు

India | Aug 25, 2025
నాగులుప్పలపాడు మండలంలోని ఉప్పుగుండూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సోమవారం సీఐ శ్రీకాంత్ బాబు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ... బాలికలను ఆకతాయిలు వెంటపడి వేధిస్తే ఆ సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలపాలన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాల జోలికి వెళ్లి విద్యార్థులు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని విద్యార్థులకు సీఐ సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us