పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సొంత నిధులతో రూ.2 లక్షల వ్యయంతో అమీన్పూర్ న్యూ సాయి భగవాన్ కాలనీలో కమ్యూనిటీ సీసీ కెమెరాలను ప్రారంభించారు. నేరాల నియంత్రణ, నేరగాళ్ల గుర్తింపులో సీసీ కెమెరాలు కీలకమని ఆయన తెలిపారు. త్వరలో కాలనీ ప్రజల కోసం మినీ ఫంక్షన్ హాల్, పార్క్ అందుబాటులోకి రానున్నాయని హామీ ఇచ్చారు.