అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఫుట్బాల్ గ్రౌండ్ సమీపంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో మదర్ థెరిస్సా 115వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మంగళవారం జరిగిన కార్యక్రమంలో ముందుగా మదర్ థెరిసా చిత్ర పటానికి పెన్షనర్ల సంఘం కోశాధికారి జెన్నే కుల్లాయిబాబు, సంయుక్త కార్యదర్శి లక్ష్మి నారాయణ రెడ్డిలు పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదర్ థెరిసాగా పేరు పొందిన ఆఘ్నస్ అల్వేనియ రోమన్ దేశానికి చెందిన క్యాథలిక్ సన్యాసిని అన్నారు. ఆమె భారత దేశ పౌరసత్వం పొంది కలకత్తాలో మిషనరీష్ ఆఫ్ చారిటీ అనే సంస్థను స్థాపించిందన్నారు.