భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'లో 400 మంది శాస్త్రవేత్తలు అహర్నిశలు శ్రమించి దేశ భద్రతకు అవసరమైన సమాచారాన్ని అందించారని ఛైర్మన్ నారాయణన్ శుక్రవారం తెలియజేశారు. ఉపగ్రహాల ద్వారా నిరంతరం సమాచారం అందిస్తూ ఈ ఆపరేషన్ విజయవంతం కావడానికి కృషి చేశారన్నారు. అంతేకాకుండా.. 2027 నాటికి గగన్‌యాన్ ప్రాజెక్టు ద్వారా తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయోగానికి ఇస్రో సన్నాహాలు చేస్తోంది. 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రం.. 2040 నాటికి చంద్రునిపైకి వ్యోమగాములను పంపే లక్ష్యాలను కూడా ఇస్రో నిర్దేశించుకుంది.