ధర్మవరం పట్టణంలోని చెరువులో శనివారం వినాయకులను నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైంది.ఈ సందర్భంగా ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో నెలకొల్పిన వినాయకుడి విగ్రహాన్ని ధర్మవరం బీజేపీ నాయకులు యశోద పాఠశాల వద్ద ఉన్న చెరువులో నిమజ్జనం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు హరీష్ బాబు,పట్టణ అధ్యక్షుడు జింకా చంద్ర, జిల్లా నాయకుడు సాకే ఓబిలేసు తదితరులు పాల్గొన్నారు.