గుంటూరు జిల్లాలోని పంచాయతీల్లో 32 కోట్లు నిధులు అందుబాటులో ఉన్నాయని జిల్లా పంచాయతీ అధికారి సాయి కుమార్ తెలిపారు. 13 కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి పన్నులు చెల్లించడాన్ని సులభతరం చేసేందుకు 'స్వర్ణ పంచాయతీ' కార్యక్రమం సోమవారం ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమం వల్ల ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని సాయికుమార్ తెలిపారు.