పాల్వంచ మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామానికి చెందిన సునీత పాల్వంచ పట్టణంలో ఓ జ్యూస్ దుకాణంలో పనిచేస్తూ జీవనం సాగిస్తుంది.. శుక్రవారం రాత్రి పని ముగించుకొని తన భర్త ఆటోలో వెళుతుండగా జగన్నాధపురం గ్రామ సమీపంలో ఆటోలో నుండి పడి తీవ్ర గాయాలయ్యాయి.. పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స అనంతరం కొత్తగూడెం, అక్కడనుండి వరంగల్ మెరుగైన వైద్యం తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందిందని స్థానికులు తెలిపారు