Kavali, Sri Potti Sriramulu Nellore | Aug 28, 2025
కావలిలోని వైకుంఠపురం మున్సిపల్ పాఠశాలలో గురువారం మధ్యాహ్నం భోజనం వండలేదు. టీచర్లే మనిషికి రూ.500 చొప్పున డబ్బులు వేసుకుని హోటల్ నుంచి భోజనం తీసుకొచ్చి పిల్లలకు పెట్టారు. ఇటీవల కాలంలో మధ్యాహ్న భోజన నిర్వాహకులు సక్రమంగా పనిచేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇవాళ పూర్తిగా వంట చేయడమే మానేశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు బుదవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఆరోపిస్తున్నారు.