గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెం వద్ద బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న కొలసాని శ్రీనివాసరావు అనే యువకుడు మృతి చెందాడు. గుంటూరు నుండి తన స్వగ్రామం అన్నపర్రుకు వస్తుండగా, ట్రాక్టర్ వెనుక భాగాన్ని ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. శ్రీనివాసరావు మృతదేహాన్ని పెదనందిపాడు పోలీసులు స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం గుంటూరు జిజిహెచ్ కి తరలించారు. ఈ ఘటనపై పెదనందిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.