కనిగిరి మండలంలోని గురవాజీపేట, వంగపాడు గ్రామాల్లో మంగళవారం సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కార్యక్రమా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కనిగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యారవ రమా శ్రీనివాసులు మాట్లాడుతూ.... రైతులు రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గించి, సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని సూచించారు. సేంద్రియ వ్యవసాయం వల్ల కలిగే లాభాలను రైతులకు ఆయన వివరించారు. కార్యక్రమంలో తహసిల్దార్ రవిశంకర్, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.