Download Now Banner

This browser does not support the video element.

రైతుల వద్ద ఉన్న నల్లబర్లి పొగాకును వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట రైతుల ధర్నా

Ongole Urban, Prakasam | Sep 1, 2025
రైతుల వద్ద ఉన్న నల్ల బర్లి పొగాకును వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రకాశం జిల్లా రైతు సంఘం ఆధ్వర్యంలో పొగాకు రైతులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన 80 రోజులుగా రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన పొగాకు వెంటనే డబ్బులు చెల్లించాలన్నారు. అదేవిధంగా ఇప్పటివరకు రైతుల వద్ద నుండి 6000 మెట్రిక్ టన్నుల పొగాకును మాత్రమే కొనుగోలు చేశారని ఇంకా 83% పొగాకు రైతులు వద్దనే ఉందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం మేరకు రైతుల వద్ద ఉన్న చివరి ఆకు వరకు పొగాకును కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us