అమెరికాతో దౌత్య సంబంధాల్లో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం హుస్నాబాద్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణకు సంబంధించి అనేక సందర్భాల్లో విదేశాల నుండి పెట్టుబడులకు ఆహ్వానిస్తుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా దేశానికి సంబంధించిన నియమ నిబంధనలు మనవాళ్లు చదువుకోవడానికి వెళ్లే వారికి ఆటంకం కలుగుతుందని తెలిపారు. దౌత్య సంబంధాల్లో విదేశాంగ శాఖ ఇలాంటి నియంత్రణలు పెడుతున్నప్పుడు భారత ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. ఇక్కడి నుండి చదువుకోడానికి వెళ