విజయవాడలో జరిగిన జోనల్ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో బాపట్ల జిల్లా వెయిట్ లిఫ్టర్లు తమ ప్రతిభ ప్రదర్శించి నాలుగు స్వర్ణ,ఒక కాంస్య పతకాన్ని సాధించారు. జిల్లా నుండి మొత్తం ఆరుగురు ఈ పోటీలకు హాజరుకాగా ఐదుగురు పతకాలు పొందారని కోచ్& మేనేజర్ ప్రవీణ్ కుమార్ శుక్రవారం మీడియాకు చెప్పారు.స్వర్ణ పతకాలు పొందిన నలుగురు వెయిట్ లిఫ్టర్లు తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఆయన వివరించారు.