ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా జిల్లా అధికారులు పనిచేసే లక్ష్యాలు సాధించాలని కొత్త కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు.పదవీబాధ్యతలు స్వీకరణ అనంతరం శనివారం ఆయన జిల్లా అధికారులతో పరిచయ సమావేశం నిర్వహించారు.విధుల నిర్వహణ విషయంలో అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తానని,పనితీరు బాగోకపోతే మాత్రం చర్యలు తీసుకుంటానని ఆయన పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు.గ్రీవెన్స్ సెల్ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం కూడదన్నారు.