విధి నిర్వహణ సమయంలో కార్యాలయం లేని వివిధ హోదాలలో పని చేస్తున్న ఉద్యోగులపై వేటు పడింది. రోడ్లు, భవనాల శాఖ ఈఈ (ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) కార్యాలయానికి చెందిన ఏడుగురు ఉద్యోగులపై ఒకేసారి సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సస్పెన్షన్ చేశారు. కలెక్టర్ కార్యాలయంలోని ఆర్ అండ్ బీ ఈఈ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సమయంలో ఏడుగురు అధికారులు కార్యాలయంలో లేకపోవడాన్ని గమనించి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.