ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలోని దోనూరు గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శంకర్ రాత్రి వినాయక నిమజ్జనంలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరి వేసుకున్నట్లు తెలిపారు. ఉదయం తల్లిదండ్రులు ఇంకా ఇంట్లో నుంచి కొడుకు బయటికి రావడం లేదని వెళ్లి చూసేసరికి అప్పటికే ఉరివేసుకొని మృతి చెంది ఉన్నాడు. ఉన్న ఒక్క కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లికి కడుపుకోత మిగిలిచ్చాడు. తండ్రితో పాటు వ్యవసాయం పనులు చేస్తూ కుటుంబానికి అండగా ఉన్నాడు. కొడుకు మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అల