అనంతపురం జిల్లా పామిడి శివారులోని బైపాస్ రోడ్డులో గురువారం కారు ఢీ కొని ఆవు మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పామిడి బైపాస్ రోడ్డు 44వ నంబర్ జాతీయ రహదారిపై గుత్తి నుంచి అనంతపురం వైపు కారు వెళ్తుండగా రోడ్డుపైకి ఒక్కసారిగా ఆవు వచ్చింది. దీంతో కారును డ్రైవర్ నియంత్రించుకోలేక ఢీకొనగా ఆవు అక్కడిక్కడే మృతి చెందింది. కారు డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. రోడ్డుపై ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.