అనకాపల్లి జిల్లా పరవాడలోని వెన్నెలపాలెం గ్రామంలో వినాయక చవితి వేడుకల్లో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. పంచాయితీకి సంబంధించిన వినాయక విగ్రహం పెట్టే విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గత రెండు రోజులుగా కొనసాగుతున్న ఈ వివాదంలో, మొదట వైసీపీ నాయకులు రామాలయానికి తాళం వేయగా, తర్వాత టీడీపీ వారు కూడా తాళం వేశారు. ఈ రోజు వినాయక చవితి సందర్భంగా ఇరువర్గాలు రామాలయం వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పరవాడ పోలీసులు రంగప్రవేశం చేసి, ముందుగా అనుమతి పొందిన వారే ప