చంద్రశేఖరపురం: స్వచ్ఛ పాఠశాలల అవార్డుల కోసం చంద్రశేఖరపురం మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈనెల 15వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఆన్లైన్లో పూర్తి చేయాలని చంద్రశేఖరపురం మండల విద్యాశాఖ అధికారి రాజాల కొండారెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ..... కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు స్వచ్ఛ పాఠశాలల అవార్డులను అందజేస్తుందన్నారు. అవార్డుల కోసం ఎంపిక కావాలంటే చంద్రశేఖరపురం మండలంలోని అన్ని పాఠశాలలు రిజిస్ట్రేషన్ లో ప్రక్రియ పూర్తి చేయవలసి ఉంటుందని ఎంఈఓ తెలిపారు. ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకొని రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.