Download Now Banner

This browser does not support the video element.

నిజామాబాద్ సౌత్: నగరంలో VIP ల సెక్యూరిటీ ఆఫీసర్లకు CP సాయి చైతన్య శిక్షణ

Nizamabad South, Nizamabad | Aug 22, 2025
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్నటువంటి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ల శిక్షణ కార్యక్రమాన్ని పోలీస్ కమాండ్ కంట్రోల్ హాలులో నిర్వహించారు. ఈ శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీస్ కమిషనరేట్ పరిధిలో VIP ల భద్రతా నేపథ్యంలో సేవలు అందించే PSOల పాత్ర అత్యంత ముఖ్యమైనదన్నారు. కావున తమ నైపుణ్యాలను మెరుగుపరచడానికి , అత్యాధునిక విధానాలపై అవగాహన కల్పించడానికి, ఇంకా అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవలసిన చర్యలపై స్పష్టత ఇవ్వడానికి ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందనీ అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us