ఎడతెరిపి లేకుండా కురుస్తున్న. వర్షాలతో రెండు మూడు రోజులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో సూచించారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల. దుబ్బాక నియోజకవర్గం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పురాతన ఇళ్లలో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అన్నారు. నదులు,వాగులు లోతట్టు ప్రాంతాలు,కల్వర్టులు వంటి వాటి వద్దకు వెళ్లవద్దన్నారు.