మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం వెన్నచేడ్ గ్రామంలో ప్రవేట్ ఆసుపత్రిలో వైద్యం వికటించి మహిళ మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. గండీడ్ మండలం గోవిందపల్లి తాండకు చెందిన లక్ష్మీ నాయక్ అనే మహిళా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర వైద చికిత్స కోసం వెళ్లి ఇంజక్షన్లు తీసుకున్న అనంతరం మహిళా శ్రోతప్పి కింద పడిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటికే మహిళ మృతి చెందిందని స్థానికుల గుర్తించారు ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు మృతి దేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు.