జిన్నారంలో రైతులకు విద్యుత్ సమస్య తీర్చాలని బాధిత రైతులు కోరుతున్నారు. జిన్నారం, లక్ష్మీపతి గూడెం మధ్యలో వాగు వద్ద ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ నుండి బోరు మోటార్లకు గత 4 రోజుల నుండి కరెంటు సప్లై రావటం లేదని బాధిత రైతులు వాపోయారు. విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇచ్చిన కరెంటు సమస్యను తీర్చలేదని, కరెంటు లేక బోర్లు నడువక వరి కలుపు తీయాల్సిన సమయంలో వరిమడుగు ఎండిపోవడం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు.