శ్రీకాకుళం మండల పరిధిలోని పెదపాడు ప్రధాన రోడ్లులో గడిచిన2నెలలుగా రోడ్లు విస్తరణ పనుల్లో భాగంగా గోతులను పూడ్చకుండా వదిలేయడంతో వాహనదారులు స్థానిక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. స్థానికంగా ఆవాస నివాసం ఉన్నవారు సైతం చెక్క పలకల పైన రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.వృద్ధులు చిన్నారులు సైతం గోతుల్లో పడి నాన్న ప్రమాదాలకు గురవుతున్నారు. వాహనదారులైతే రాత్రులు తొలి ప్రమాదాలకు గురవుతున్నారు. ఇదే విషయాన్ని ఆర్ అండ్ బి అధికారి రాజశేఖర్ వద్ద ప్రస్తావించగా మున్సిపల్ యంత్రాంగం వాటర్ పైపు నిమిత్తం గోతుల్లో ఏర్పాటు చేసేందుకు గాను కొంత సమయం అడిగిందని దానివల్ల ఆలస్యం అయ్యింది.