ఎల్లారెడ్డి పట్టణంలో వినాయక చవితి సందర్భంగా ఈ ఏడాది భారీ వినాయకులను ప్రతిష్టించారు. శనివారం రాత్రి వినాయకుల నిమజ్జనం ప్రారంభం కానుంది కావున. భారీ గణపతులు విద్యుత్ లైన్లను తాకే అవకాశం ఉన్నందున, విద్యుత్ సిబ్బంది వైర్లను పైకి కడుతున్నారు. పలు చోట్ల కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి, లైన్లను పైకి లాగుతున్నారు. ఇనుప విద్యుత్ స్తంభాలకు పీవీసీ పైపులు కడుతున్నారు. విద్యుత్ సమస్య రాకుండా జిల్లా విద్యుత్ ఎస్ఈ, డీఈ ఆదేశాల మేరకు ఏఈ పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయని లైన్ మెన్ శశికాంత్ రెడ్డి తెలిపారు.