అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో మూసి పరివాహక ప్రాంతంలో ఒక గుర్తు తెలియని మృతదేహం కొట్టుకు వచ్చిన ఘటన గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డంపింగ్ యార్డ్ సమీపంలో మూసిలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృద్దేహాన్ని పరిశీలించి మెడకు కేబుల్ వైర్లు చుట్టూ ఉన్నాయి హత్య చేశారా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. కేసు నమోదు చేశామని అన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.