తాబేల్లు పట్టడానికి వెళ్లి నీట మునిగిన వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు మహబూబాబాద్ జిల్లా కురవి ఎస్ఐ సతీష్ మంగళవారం ఉదయం 11:00 లకు తెలిపారు. కురవి మండలం నల్లెల గ్రామ శివారు కుంటలో వెంకన్న స్నేహితుడితో కలిసి తాబేల్లు పట్టడానికి వెళ్లి నీట మునిగి గల్లంతైన విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం వరకు గాలించినా అతడి ఆచూకీ లభ్యం కాలేదన్నారు.మంగళవారం ఉదయం మృతదేహం లభ్యమయిందని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.