యాదాద్రి భువనగిరి జిల్లా: ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలు ఎంపీటీసీల వారిగా రూపొందించిన ఓటర్ల ముసాయిదా జాబితాలను వలిగొండ ఎంపీడీవో కార్యాలయంలో శనివారం విడుదల చేశారు. ఈ జాబితాను ఎంపీడీవో కార్యాలయం అన్ని గ్రామ పంచాయతీల నోటీస్ బోర్డులో ప్రదర్శించినట్లు ఎంపీడీవో జలంధర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సూపర్ దెండెంట్ నిరంజన్ తో పాటు కార్యాలయ సిబ్బంది పంచాయతీ కార్యదర్శిలు తదితరులు పాల్గొన్నారు.