రానున్న సర్పంచ్ ఎన్నికలకు బిజెపి నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ధర్మవరం బిజెపి ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. బుధవారం ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు జిఎం శేఖర్ అధ్యక్షతన ధర్మవరం మండల బిజెపి నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో హరీష్ బాబు మాట్లాడుతూ రానున్న ఎన్నికల దృష్ట్యా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామన్నారు.