సిరిసిల్ల పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్యఅతిథిగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళ్ళు అర్పించారు. బుధవారం ఉదయం 11:30 గంటల సమయంలో ఆయన మాట్లాడుతూ వీరనారి చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలు అని అన్నారు. ఆమె ఆశయాలను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ ఉద్యమంలో ఆమె ముఖ్య పాత్ర పోషించారని అన్నారు. తెలంగాణ పౌరుషాన్ని ,పోరాటాన్ని త్యాగాన్ని భావితరాలకు అందించిన ఉద్యమ స్ఫూర్తిని గొప్ప పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని