సిరిసిల్ల పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అర్హులకు చేయూత పింఛన్ పథకం లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చేయూత పెన్షన్లపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేయుట పథకం కింద వృద్ధులకు, దివ్యాంగులకు, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు, వితంతువులకు, నేతన్నలకు, గీత కార్మికులకు, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, బీడీ టేకదారులకు, డయాలసిస్, ఫీలేరియా పేషెంట్లకు ప్రభుత్వం పెన్షన్ అందిస్తుందని అన్నారు. వృద్ధాప్య పెన్షన్ దారులు మరణిస్తే వెంటనే పెన్షన్ వారి జీవిత భాగస్వామికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నా