అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట 50 నిమిషాల సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ నేత మిథున్ రెడ్డి పై అక్రమ కేసులు బనాయించి ఎలాంటి సాక్షాలు లేకుండా జైల్లో ఉంచడం జరిగిందని నిన్నటి రోజున వైసీపీ నేత మిథున్ రెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగిందని కేసులో సాక్షాలు లేకుండా అరెస్ట్ చేయడం అన్యాయమని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మిథున్ రెడ్డి అరెస్టుపై పలు విమర్శలు చేశారు