SC కార్పొరేషన్ సబ్సిడీ రుణాలను వెంటనే విడుదల చెయ్యాలని కోరుతూ ప్రగతిశీల రెవల్యూషనరీ విద్యార్థి,యువజన సంఘం (పిఆర్ఎస్ వైఎఫ్) ఆధ్వర్యంలో బుధవారం నాడు కడప నగరంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్నటువంటి ఎస్సి కార్పొరేషన్ కార్యాలయం నందు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈఓ) రవీంద్రనాథ్ రెడ్డి గారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పిఆర్ఎస్ వైఎఫ్ రాష్ట్ర కన్వీనర్ కన్నెలూరు శంకర్ మాట్లాడుతూ2025-2026 వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బ్యాంకింగ్ సబ్సిడీ రుణాలను వెంటనే విడుదల చేయాలని, ఈ రుణాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 10-04-2025 తేదీన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.