చివ్వెంల పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే . ఘటనకు సంబంధించి సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ మీడియాకు వివరాలు తెలిపారు. దూరజ్ పల్లి కు చెందిన వ్యక్తి మున్నీరు ఖాన్ శనివారం రాత్రి 10:45 కు తనపై దురాజ్పల్లి కి చెందిన భాష అనే వ్యక్తి దాడి చేసి హత్యయత్నానికి ప్రయత్నించారని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ తెలిపారు. ఇందులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ కూడా బాధితుడు వెంట వెంబడించినట్లు ఆ వీడియోలో ఉందని తెలిపారు. అందులో భాగంగానే నిందితులను స్టేషన్ కు పిలిపించి విచారించినట్లు తెలిపారు.