నరసాపురం పట్టణంలో పశ్చిమగోదావరి జిల్లా వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో అన్నదాత పోరు నిరసన కార్యక్రమం మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నరసాపురం వైయస్సార్సీపీ పార్టీ కార్యాలయం నుండి ఆర్డీవో కార్యాలయం వరకు భారీ సంఖ్యలో నిరసన ర్యాలిగా వెళ్లి ఆర్డిఓకి వినతిపత్రం అందజేశారు. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముదునూరి ప్రసాద రాజు మీడియాతో మాట్లాడుతూ.. రైతన్నకు బాసటగా వైయస్సార్సీపీ ఉంటదని చెప్పారు. యూరియాతో సహా రైతులుకు అవసరమైన ఎరువులును వెంటనే పంపణీ చేయాలి అని డిమాండ్ చేసారు.