This browser does not support the video element.
విశాఖపట్నం: పారదర్శకంగా మద్యం బార్ల కేటాయింపు ప్రక్రియ*
*ఆశావహుల సమక్షంలో లాటరీ తీసిన జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్
India | Aug 30, 2025
ఆంధ్రప్రదేశ్ గెజిట్ నూతన బార్ పాలసీ 2025-28 నిబంధనలకు అనుగుణంగా జిల్లాలోని మద్యం బార్ల కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా జరిగింది. స్థానిక వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో శనివారం ఉదయం నిర్వహించిన కార్యక్రమంలో జేసీ కె. మయూర్ అశోక్ ఆశావహుల సమక్షంలో లాటరీ తీసి బార్లను కేటాయించారు. జీవీఎంసీ పరిధిలో 131 (రిజర్వ్ 10+ఓపెన్ 121) బార్లకు గాను ఆశావహుల నుంచి 263 దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిశీలించి నూతన బార్ పాలసీ నిబంధనల మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. గీత కులాలకు పది, జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 57 బార్లను కేటాయిస్తూ లాటరీ తీశారు