ఎమ్మిగనూరు నియోజవర్గ పరిధిలోని నందవరంలోని స్థానిక ఇంటి గ్రేటెడ్ హాస్టల్లో చినుకు పడితే చాలు విద్యార్థులు బురద దాటి బడికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల కురిసిన వర్షాలకు దారంతా బురదమయంగా తయారైంది. పాఠశాలకు వెళ్లాలన్నా, హాస్టల్ కు రావాలన్నా ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.