ఆరు అడుగుల బుల్లెట్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు చెబితే వైయస్ జగన్ వెన్నులో వణుకు పుడుతుందని, ఒక విధ్వంసకర వ్యక్తి చేతి నుండి రాష్ట్రాన్ని కాపాడిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ అని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమలశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. మంగళవారం భీమవరంలోని బిజెపి నర్సాపురం పార్లమెంట్ కార్యాలయంలో కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ సమక్షంలో ఎన్డీఏ కూటమికి చెందిన టీడీపీ, బీజేపీ, జనసేన నాయకుల ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ కేక్ కట్ చేశారు.