చింతలపాలెంలో భూభారతి సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. రైతు నాగరాజు కలెక్టర్ ఎదుటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన భూమిని వేరే వ్యక్తులకు పట్టా చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఎన్నిసార్లు చెప్పినా అధికారులెవరూ పట్టించుకోలేదన్నాడు. తన భూమిని ఇప్పించి న్యాయం చేయాలని రైతు కోరాడు.