ధర్మవరం ఎంపీడీవో కార్యాలయం వద్ద మంగళవారం దివ్యాంగులు ఆందోళన చేశారు.అనర్హుల ఏరివేతలో అర్హులైన తమకు పెన్షన్లు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.సీపీఎం అనుబంధ నాయకులు జంగాలపల్లి పెద్దన్న సీఐటీయూ నాయకులు ఆయూబ్ ఖాన్ మాట్లాడుతూ అర్హులైన దివ్యాంగులకు పెన్షన్ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీవో సాయి మనోహర్ కు వినతి పత్రం ఇచ్చారు