రైతు సేవా కేంద్రాల ద్వారా అందిస్తున్న ఎరువులు సద్వినియోగం చేసుకోవాలని చీడిపాలెం పంచాయతీ సర్పంచ్ సోమన్నదొర రైతులకు సూచించారు. గురువారం శింగవరంలోని చీడిపాలెం రైతు సేవా కేంద్రంలో గ్రామ వ్యవసాయ సహాయకురాలు కళ్యాణి ఆధ్వర్యంలో పలువురు రైతులకు యూరియా ఎరువు పంపిణీ చేశారు. ప్రైవేట్ దుకాణాల్లో ఎరువులను అధిక ధరలకు కొని మోసపోవద్దన్నారు. రైతుల కోరిక మేరకు మరో వారం రోజుల్లో ఎరువులను తెప్పించడం జరుగుతుందన్నారు.