దేశవ్యాప్తంగా వర్షపు నీటి సంరక్షణ కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలవడం మరియు జిల్లా కు ప్రత్యేక గుర్తింపు రావడం గర్వకారణమని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న “జల్ సంచయ్ జన్ భాగీదారీ – 1.0” కార్యక్రమం కింద భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రత్యేక గుర్తింపు పొందడం, రూ.25 లక్షల నగదు బహుమతి లభించడం గర్వించదగిన విషయం అని కలెక్టర్ శుక్రవారం తెలిపారు...